Corona : విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి!

దేశవ్యాప్తంగా కొత్తగా 257 కేసులు – కేంద్రం అప్రమత్తం

Corona : విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి!

ముంబాయి, సూర్య ప్రతినిధి : కోవిడ్ మళ్లీ తలెత్తుతోంది. 2020లో ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి, ఇప్పుడు మరోసారి దేశంలో తన ఉనికిని గుర్తుచేస్తోంది. తాజాగా భారతదేశంలో 257 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న 59 ఏళ్ల మహిళ ఒకరు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలుడు మరణించారని అధికారులు వెల్లడించారు. వీరిద్దరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఫలితాలు పాజిటివ్ వచ్చినట్లు తేలింది.

ఈ ఘటనలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను మరోసారి మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేయడం, సాంఘిక దూరం పాటించడం, అలాగే వాక్సినేషన్ బూస్టర్ డోసులు తీసుకోవడం వంటి జాగ్రత్తలపై దృష్టి సారించమని సూచించింది.

వైద్య నిపుణులు కోవిడ్ తీవ్రత పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.

Tags: Corona

About The Author

Suryaa Desk Picture

Surya Telugu news, crime investigations, Telugu World news, political analysis, Telugu big stories, Telugu news daily, 

Related Posts

Advertisement

Latest News

సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..! సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవలి కాలంలో ఒక పేరు చర్చనీయాంశమైంది. ఈఎల్వీ ఫౌండేషన్ భాస్కర్. సేవా కార్యక్రమాల పేరిట గ్రామాల్లో చురుకుగా తిరుగుతున్న ఆయన చుట్టూ ఇప్పుడు...
బొల్లంపల్లి రేసులో బూర్గు లింగం యాదవ్ హాట్ టాపిక్..!
అందరికి తెలిసాక ఆకస్మికం ఎలా అవుతుంది..!?
ఏడీపీ ఇండియా 26వ వార్షికోత్సవం
టీచర్ యాదయ్య సహకారంతో విద్యార్థులకు మెరుగైన విద్య
వివాదాస్పదంగా మునుగోడు కాంగ్రెస్‌ నేతల వ్యవహారం
మట్టిలో తెలుగు మాణిక్యం