బడికి వెళ్లే బాటను బాగు చెయ్యండి
మర్రిగూడ(ప్రభాత సూర్య):
మండలంలోని వట్టిపల్లి ప్రాథమికొన్నత పాఠశాలకు వెళ్లే, దారి చెట్లు, ముండ్లపొదలతో మూసుకుపోయిందని, అటుగా ఏవైనా వాహనాలు వస్తే, విద్యార్థులకు పక్కకు జరిగే అవకాశం లేకుండా ఉందని, వెంటనే రోడ్డును బాగు చెయ్యాలని గ్రామ యువకులు కోరారు. మన ఊరు, మన బడి, మన పిల్లలే కాబట్టి కాపాడుకునే బాధ్యత మనదేనని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును వెంటనే, మరమత్తు చెయ్యాలని యువకులు కోరారు. స్కూల్ పక్కనే ఉన్న వేపచెట్టుకు కరెంట్ వైర్లు అనుకున్నాయని, వర్షాలు వస్తున్న క్రమంలో పిల్లలను కరెంట్ వైర్లు ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉందన్నారు. చెట్లు, పొదల కారణంగా ఇంతకు ముందే పలు మార్లు, స్కూల్ పరిధిలోకి పాములు వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ సమస్యలపై స్పందించి పిల్లలకు ప్రమాధాలు జరగకుండా చూడాలని, అధికారులను గ్రామ యువత కోరారు. ఈ సమస్యలను గ్రామ సోషల్ మీడియా వేదికగా, వైరల్ చేస్తూ సమస్యలను బహిర్గతం చేస్తున్నారు. ముందుకు వచ్చే నాయకుల కోసం ఎదురు చూస్తున్నారు..
About The Author
