తల్లితండ్రులకు పరువు నష్టం వేధింపులు -వట్టిపల్లిలో ఓ పుత్రరత్నం అరాచకం

తల్లితండ్రులకు పరువు నష్టం వేధింపులు -వట్టిపల్లిలో ఓ పుత్రరత్నం అరాచకం

వృద్ద తల్లిదండ్రులకు గర్భశోక బాధలు

మర్రిగూడ(ప్రభాత సూర్య):- తన కడుపున పుట్టిన కొడుకే… వృద్ధ తల్లిదండ్రులపై కోర్టుల్లో కేసులు వేస్తూ, వాళ్లను వేధించడమే కాకుండా, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక జర్నలిస్టులకూ లీగల్ నోటీసులు పంపిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

వట్టిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మల్గిరెడ్డి మాధవరెడ్డి (80), సుశీలమ్మ (75) దశకాలుగా తమ కుమారుడి అరాచకాల బాధలు భరిస్తున్నారు. మాతృస్నేహం, పితృవందనం మరిచిన కొడుకు శ్రీనివాస్ రెడ్డి తన తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండగా, వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దుస్థితిని చూసి మానవతా దృష్టితో స్పందించిన కొంతమంది జర్నలిస్టులు, తల్లిదండ్రుల పక్షంగా నిలిచారు. వారి సమస్యను స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కానీ దీన్ని సహించలేని కొడుకు – తమ చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు జర్నలిస్టులకే ‘డిఫర్మేషన్ సూట్’ (పరువు నష్టం కేసు నోటీసులు) పంపించాడు. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో మానవ సంబంధాల పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతగల కుమారులు, స్వార్థంతో బతికే ఆలోచనలతో అలాంటి అమానుష చర్యలకు పాల్పడతారా అన్నది గమనించాల్సిన విషయం. ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు కొడుకుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తల్లిదండ్రుల బాధలకు మద్దతుగా...

"ఈ సంఘటన జాతీయ వృద్ధుల హక్కుల చట్టం (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) ఉల్లంఘనకు నిదర్శనం," అని ఒక సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఏ దిశగా వెళ్తున్నామనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల సేవ చేయడం కర్తవ్యమని భావించకుండా, వారిని భారంగా భావించడం దారుణం. ఈ ఘటనపై అధికార యంత్రాంగం సుమోటోగా స్పందించాలని, బాధిత తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.

బాధితుల పక్షాన నిలిచిన మీడియాకు బెదిరింపులా.?

తల్లిదండ్రులు అలనా పాలనతో పెంచిన కొడుకు, వారినే చివరకు ఊహించని విధంగా వేధించడం మానవ సంబంధాల విలువల పతనాన్ని సూచిస్తోంది. వృద్ధ తల్లిదండ్రులు నిత్యం మనోవేదనలో బతకాల్సి వస్తున్న ఈ విషాద ఘటనకు, న్యాయం చేయాలన్న లక్ష్యంతో మీడియా బాధితుల పక్షాన నిలిచింది.

న్యాయం, మానవత్వం, హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది మీడియా… ఈ వ్యవహారంలో కూడా నిర్భయంగా ముందుండి పోరాడుతుంది. బెదిరింపులు, నోటీసులు, మనోవ్యాధి పద్దతులు –ఇవన్నీ మీడియా ధైర్యాన్ని తక్కువ చేయలేవు. ఎందుకంటే… నిజం పక్షాన నిలిచిన వాళ్లను చరిత్రే గౌరవిస్తుంది

Tags:

About The Author

Thuppari Raghu Picture

Sr Crime investigation journalist 

Advertisement

Latest News

సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..! సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవలి కాలంలో ఒక పేరు చర్చనీయాంశమైంది. ఈఎల్వీ ఫౌండేషన్ భాస్కర్. సేవా కార్యక్రమాల పేరిట గ్రామాల్లో చురుకుగా తిరుగుతున్న ఆయన చుట్టూ ఇప్పుడు...
బొల్లంపల్లి రేసులో బూర్గు లింగం యాదవ్ హాట్ టాపిక్..!
అందరికి తెలిసాక ఆకస్మికం ఎలా అవుతుంది..!?
ఏడీపీ ఇండియా 26వ వార్షికోత్సవం
టీచర్ యాదయ్య సహకారంతో విద్యార్థులకు మెరుగైన విద్య
వివాదాస్పదంగా మునుగోడు కాంగ్రెస్‌ నేతల వ్యవహారం
మట్టిలో తెలుగు మాణిక్యం