లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు.. అభివృద్ధికి తొలి అడుగు..

ప్రజా సేవలో కొడాలకు ఎవరూ లేరు సాటి..

  • కరోనా సమయంలో ఆపద్బాంధవుడుగా వెంకట్ రెడ్డి.

  • నిత్యం ప్రజా సేవలో కొడాల బ్రదర్స్..

  • పదవి లేకున్నా ప్రజల కోసమే వెతుకులాట..

MRG

మర్రిగూడ(ప్రభాత సూర్య) :- ప్రజలంటే వారికి ఎనలేని ప్రేమ.. నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమం ముందేసుకుంటూ, పేదలకు అండగా నిలుస్తారు కొడాల బ్రదర్స్.. పదవులు లేకున్నా, ప్రజా క్షేత్రంలో మెదిలే కొడాల వెంకట్ రెడ్డి, అల్వాల్ రెడ్డిలు చేసిన సేవలు అంతాఇంతా కాదనే చెప్పుకోవాలి.. ప్రజల ప్రాణాలను కాటువేసే కరోనా సమయంలో కూడా, కుటుంబం మొత్తం ప్రజల ప్రాణాల కోసం పాకులాడారు.. నిత్యావసర వస్తువులు పంపిణి చేస్తూ సేవా గుణాన్ని చాటారు.. ఆపద సమయంలో ఆ అన్నదమ్ముల అభయహస్తం, ఎందరినో కాపాడింది.. సమయం దొరికితే చాలు, ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించే కొడాల వెంకట్ రెడ్డి, స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నిలిచారు.

సర్పంచ్ గా ప్రజలకు మరింత చేరువై, అభివృద్ధికి తోడ్పాటుకై శ్రమిస్తున్నాడు. గ్రామంలో ప్రచారం చేస్తున్న కొడాలకు జనం నిరాజనాలు పడుతున్నారు. ఆపదలో ఆదుకునే నేతను, అందెలం ఎక్కించాలని ఆలోచిస్తున్నారు. పదవి లేకున్నా ప్రాణంలా ప్రజలను కాపాడుతూ వస్తున్నారు కొడాల బ్రదర్స్.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో, ముందడుగు వేస్తూ స్థానిక సమరంలో నిలుచున్నాడు.. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధికి, మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రజలను కాపాడుకుంటానని వెంకట్ రెడ్డి అంటున్నారు.. తనకు కేటాయించిన లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నాడు.. ఆయన చేసిన సేవలను నెమరేసుకుంటూ, ఆయన వెంటే నడుస్తున్నారు ప్రజలు. వెంకట్ రెడ్డి గెలుపుతో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

About The Author

Thuppari Raghu Picture

Sr Crime investigation journalist 

Related Posts

Advertisement

Latest News

రెండవ విడత ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాటు రెండవ విడత ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాటు
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ నల్లగొండ ప్రతినిధి(ప్రభాత సూర్య):- జిల్లాలో రెండవ విడత ఎన్నికలకు ఎలాంటి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత...
లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు.. అభివృద్ధికి తొలి అడుగు..
Sarpanch : శివన్నగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచార వేగం పెంచిన రాపోల్
#Police : చండూరులో పోలీసులపై దాడి… ముగ్గురు యువకుల అరెస్టు
ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ
బడికి వెళ్లే బాటను బాగు చెయ్యండి
సామాజిక తనిఖీకి పంచాయతీ రాజ్ అతీతులా