రెండవ విడత ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాటు
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్
నల్లగొండ ప్రతినిధి(ప్రభాత సూర్య):-
జిల్లాలో రెండవ విడత ఎన్నికలకు ఎలాంటి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు, జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ అన్నారు.
దామరచర్ల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పి పరిశీలించి మాట్లాడారు.. ఈ నెల 14న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లి, మొత్తం 10 మండలాల్లోని 282 గ్రామ పంచాయితీలలో 2418 పోలింగ్ కేంద్రాలలో, రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికలను ప్రశాంత వాతారణంలో నిర్వహించేందుకు, ప్రతి మండలానికి సూమరు 200 చొప్పున 2000 మంది పోలీస్ సిబ్బందితో, ప్రతి మండలానికి ఒక డియస్పి స్థాయి అధికారి పర్యవేక్షణలో, రూట్ లుగా విభజించి ఎలాంటి సమస్యలు తలెత్తినా తక్షణమే అక్కడికి చేరుకునుని పరిష్కరించుటకు సీఐలు, ఎస్ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన, రౌడీ షీటర్లు, త్రిబుల్ మంగ్లర్స్ ను బైండవర్ చేయడం జరిగిందన్నారు.
గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, గొడవలు, అల్లర్లు సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని, వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో ఒక్కసారి కేసులు నమోదు అయితే, భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురవుతారని అన్నారు. జిల్లా ప్రజలు ఎలాంటి అభద్రతా భావానికి లోను కాకుండా మీ ఓటు హక్కును వినియోగించకోవాలని ఎస్పీ సూచించారు.
ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, 100 మీటర్ల వద్ద 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని పాటించాలని అన్నారు. ప్రజల అనవసరంగా గుమిగూడి ఉండరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్ లు, ఇంకు బాటిల్లు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటికి అనుమతులు ఉండవని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఊరేగింపులకు, ర్యాలీలకు అనుమతి లేదని బాణాసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
About The Author
