ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ
పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు
మర్రిగూడ(ప్రభాత సూర్య):-
మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా మారింది. ఉన్న పరిస్థితిలో తమకు అందుకోలేని ఎంబిబిఎస్ చదువు, కండ్ల ముందు కనపడంతో వారికి ఎటూ తోచని స్థితి నెలకొంది. ఉన్నది మొత్తం దారబోసినప్పటికి పరిస్థితి గట్టెక్కేలా కనపడటం లేదు. 416 మార్కులతో స్టేట్ ర్యాంక్ లో 3558 సాధించిన ఈశ్వర్ సాయికి, కొమరంభీమ్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీట్ వచ్చింది. అడుగు ముందుకేస్తే తట్టుకునే పరిస్థితిలో ఆ కుటుంబం, బలహీనమనే చెప్పాలి.. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పేదలకు అండగా నిలుస్తున్న ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్ కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులను, అక్కున చేర్చుకున్న ఫౌండేషన్ తోడు తమకు కూడా కావాలని, ఆ కుటుంబం ఆలోచిస్తుంది. భాస్కర్ రాకపోడా మా కుమారుడికి భవిష్యత్తు చూపించక పోడా అనే ఆశతో ఉన్నారు కుటుంబ సభ్యులు. తమ కుమారుడి చదువుకై సహాయం చెయ్యండి అంటూ, ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ని కోరుతున్నారు.
About The Author
