ఆపదలో ఉన్న స్నేహితునికి చేయూత

ఆపదలో ఉన్న స్నేహితునికి చేయూత

స్నేహ బంధాన్ని చాటుకున్న బాల్యమిత్రులు.

ప్రభాత సూర్య (చింతపల్లి):-

​నిజమైన స్నేహం ఆపదలో ఉన్నప్పుడే తెలుస్తుందని, చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామానికి చెందిన పలువురు యువకులు నిరూపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన మిత్రుడిని కాపాడుకోవడానికి, మేమున్నామంటూ ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. మహమ్మద్ రషీద్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో, వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన బాల్యమిత్రులు తెలుసుకున్నారు.

​తమతో కలిసి పెరిగిన స్నేహితుడు అనారోగ్యంతో, ఇబ్బంది పడటం చూసి చలించిపోయిన మిత్రులు, వెంటనే స్పందించారు. అందరూ కలిసి తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని, సేకరించి రషీద్‌కు అందజేశారు. ఈ విపత్కర సమయంలో అతనికి అండగా నిలిచి, స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ​సొంత సోదరుడిలా రషీద్‌ను ఆదుకున్న ఈ మిత్రబృందాన్ని గ్రామస్తులు మరియు స్థానికులు అభినందిస్తున్నారు. ​ఈ కార్యక్రమంలో ​ఆలంపల్లి సతీష్, ​ఊరే అనిల్ కుమార్, ​గోపి, ​రాజేష్ సాగర్, జంగయ్య, ​వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Thuppari Raghu Picture

Sr Crime investigation journalist 

Related Posts

Advertisement

Latest News