ఆపదలో ఉన్న స్నేహితుని కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు

స్నేహితుని కుటుంబానికి 74,000 వేల ఆర్థిక సాయం.

IMG-20251221-WA0012

మర్రిగూడ(ప్రభాత సూర్య):-

మండలంలోని అజిలాపురం గ్రామానికి చెందిన, మాధగోని వెంకటేష్, నవంబర్ 8న రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, మాల్ గ్రామంలో తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటివద్ద, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించాడు. మృతునికి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.. మృతుడు వెంకటేష్ తో పాటు, పదవ తరగతి విద్యను అభ్యసించిన 2001-2002 యరగండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పదవ తరగతి క్లాస్మెట్స్ అందరూ కలిసి, 74 వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని, ఆదివారం అజిలాపురం గ్రామంలో కుటుంబ సభ్యులకు అందజేసారు. అనంతరం వెంకటేష్ చిత్రపటానికి, స్నేహితులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తనతో ఉన్న స్నేహబంధాన్ని తలచుకుంటూ, కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంకటేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్బంగా మిత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పునూతల కృష్ణయ్య, రొక్కం మధుసూదన్ రెడ్డి, వెంకట్ బాబు, పాండురంగారెడ్డి, సిద్ధపురం జంగయ్య, వల్లముల శ్రీను, నారోజు రామాచారి, రమేష్, శ్రీను, కొండల్, మహ్మద్ రజాక్(జనం సాక్షి జర్నలిస్ట్) తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Thuppari Raghu Picture

Sr Crime investigation journalist 

Related Posts

Advertisement

Latest News