నల్లగొండజిల్లా కేంద్రంలో దారుణo... ఇంటర్ విద్యార్థిని హత్య..!

నల్లగొండజిల్లా కేంద్రంలో దారుణo... ఇంటర్ విద్యార్థిని హత్య..!

నల్లగొండ ఉమ్మడి జిల్లా  ప్రతినిధి (ప్రభాత సూర్య) : నల్లగొండ జి ల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ కా ర్యా లయానికి కూతవేటు దూరంలో దా రుణ దుర్ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ క ళాశాల సమీపంలో ఇంటర్ విద్యా ర్థిని దారుణ హత్యకు గురైన సం ఘటన వెలుగు చూసింది. స్థానికు లు పోలీసులు తెలిపిన సమాచా రం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ ప రిధిలోని అన్నారెడ్డిగూడెం గ్రామా ని కి చెందిన విద్యార్థిని (17) జిల్లా కేం ద్రంలోని ఓకాలేజీ లో ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరం చదు వుతోంది. నల్లగొండ మండలం గు ట్టకింది అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ అనే యువకుడితో కొం తకాలంగా ప్రేమ వ్యవహారం కొన సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం డైట్ కళా శా ల సమీపంలోని ప్రియుడి మిత్రుడు ఆటోడ్రైవర్ గదిలోకి ఇద్దరు వెళ్లా ర ని, అనంతరం ఇరువురి మధ్య గొ డవ జరగడంతో అమ్మాయిని కృష్ణ చంపేశాడని స్థానికులు పేర్కొంటు న్నారు.

ఆమెపై లైంగిక దాడి జరిగిందని, అ నంతరం హత్య చేశాడని ఆరోపి స్తున్నారు. విషయం తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూటౌన్ ఎస్సె సైదులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తు న్నారు. నిందితుడు గడ్డం కృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Tags: CrimeNews

About The Author

Thuppari Raghu Picture

Sr Crime investigation journalist 

Related Posts

Advertisement

Latest News