సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి అమానుషం
----ముదిగొండ రమేష్
ఉద్యమ కార్యచరణకు జిల్లా కార్యవర్గ సమావేశం
మర్రిగూడ(ప్రభాత సూర్య):-
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యచరణను అమలు చేయడం కోసమై, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నామని, ప్రతి ఒక్కరు ఈ సమావేశంలో భాగస్వామ్యులు కావాలని, ఎమ్మార్పిఎస్ మర్రిగూడ మండల అధ్యక్షులు ముదిగొండ రమేష్ మాదిగ పిలుపునిచ్చారు. 10 అక్టోబర్ 2025 మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ టిఎన్జివోస్ సమావేశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవింద్ నరేశ్ మాదిగ హాజరు కానున్నారన్నారు. కావున మర్రిగూడ మండలంలో ఉన్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, వి హెచ్పిఎస్, తో పాటు అన్ని అనుబంధ సంఘాల జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలం, స్థాయి నాయకులు, నాయకురాలు, ప్రతి మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని ముదిగొండ రమేష్ సూచించారు.
About The Author
