సామాజిక తనిఖీకి పంచాయతీ రాజ్ అతీతులా
మర్రిగూడ(ప్రభాత సూర్య):-
మండలంలో జరుగుతున్న 14వ విడత సామాజిక తనిఖీలో, పంచాయతీ రాజ్ పనులకు సంబంధించిన రికార్డులను తనిఖీ బృందాలకు ఇవ్వలేదు. మండల వ్యాప్తంగా రికార్డులను ఇవ్వనప్పటికి, అధికారులు మాత్రం పంచాయతీ రాజ్ అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు. ఇదే తంతు ప్రతి సామాజిక తనిఖీలో జరుగుతున్నప్పటికి, ఇప్పటి వరకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజావేదికలో సామాజిక తనిఖీ బృందాలు ఈ సమస్యను బహిర్గతం చేస్తున్నప్పటికి, ప్రిసైడింగ్ అధికారులు మాత్రం ఏమాత్రం వారిపై చర్యలు తీసుకోకపోవడం అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. చేసిన పనులను నిజాయితీగా చూయించుకునే విధానానికి, పంచాయతీ రాజ్ అధికారులు ఏమాత్రం పట్టింపు లేకుండా చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. సామాజిక తనిఖీకి రికార్డ్స్ ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు..
About The Author
