పూర్తయిన సామాజిక తనిఖీ.. ప్రజావేదికే భాకీ.
మర్రిగూడ(ప్రభాత సూర్య):-
మండలంలో జరిగిన ఉపాధి హామీ పధకాలపై, జరుగుతున్న సామాజిక తనిఖీ బుధవారంతో అన్ని గ్రామ పంచాయతీలలో పూర్తయింది. తనిఖీ బృందాలు రికార్డ్ పరంగా, క్షేత్ర స్థాయి పనులను పరిశీలించి, డోర్ టూ డోర్ విజిట్ లో ప్రజల అభిప్రాయాలను సేకరించి, నివేదికను తయారు చేసి, ఆయా గ్రామపంచాయితీలలో, ప్రజల ముందు గుర్తించిన అంశాలను బహిర్గతం చేశారు. గుర్తించిన అంశాలపై హక్కుదారుల అభిప్రాయాలు, అధికారుల వివరణలు, సిబ్బంది బాధ్యతలను పొందుపరిచి, అట్టి నివేదికను ప్రజావేదికలో పొందుపరచనున్నారు. 16న జరిగే ప్రజావేదికలో వచ్చిన ఇష్యూలను ప్రిసైడింగ్ అధికారి ముందు చర్చించి, తదుపరి చర్యలు తీసుకోనున్నారు. మూడు విడుతలలో మండలంలోని అన్ని గ్రామాల నందు, గ్రామ సభలు నిర్వహించారు. గురువారం ఉపాధి హామీ కార్యాలయం ఆవరణలో ప్రజా వేదికను నిర్వహించనున్నారు. ఎస్టిఎం వేణు ఆధ్వర్యంలో, ఎస్ఆర్పి చిన్నకేశవులు, రంజిత్ కుమార్ ల పర్యవేక్షణలో 14వ విడత సామాజిక తనిఖీ పూర్తి చేశారు.
About The Author
