మర్రిగూడ ఉపాధిపై సామాజిక తనిఖీ.

క్షేత్ర స్థాయిలో పరిశీలన.. ఆపై నివేదిక

మర్రిగూడ (ప్రభాత సూర్య) : మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై, సామాజిక తనిఖీ బృందాలు విచారణ మొదలుపెట్టాయి.. 1 ఏప్రిల్ 2024 నుండి 31 మార్చ్ 2025 వరకు జరిగిన 454 పనుల ద్వారా ఖర్చు అయిన, ఆరుకోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలపై, క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు, డోర్ విజిట్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి, ప్రజావేదికలో నివేదికను ప్రైసైడింగ్ అధికారికి సమర్పిస్తారు..

రికార్డుల నిర్వహణ, పనుల నాణ్యత, వేతనాల బదిలీలపై తనిఖీ చెయ్యనున్నారు. గత అడిట్ లో వచ్చిన సమస్యలపై, దృష్టి పెడుతూ ప్రభుత్వానికి రిపోర్ట్ ను అందించనున్నారు. తనిఖీ బృందాలలో ఎస్ఆర్పి చిన్నకేశవులు, రంజిత్ కుమార్, డిఆర్పిలు బాలరాజు, తిరుపతి, రజియా, శ్రీకాంత్, ఉన్నారు.

Tags:

About The Author

Thuppari Raghu Picture

Sr Crime investigation journalist 

Advertisement

Latest News