వడ్డీ బాధితుడు ఆత్మహత్య... పలుగుతండాలోని బాలాజీ గృహంపై దాడి
- విలువైన వస్తువులు ధ్వంసం.. ఫర్నిచర్కు నిప్పు
- గ్రామంలో ఉద్రిక్తత.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (ప్రభాత సూర్య) : అధిక వడ్డీ ఆశ చూపి పేద ప్రజల నుండి కోట్ల రూపాయ లను వసూలు చేసిన బాలాజీ నాయక్ తీసుకున్న డబ్బులను తిరిగి ఇస్తుండకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు రామావత్ సరియా నాయక్ (37) గడ్డి మందు. తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరా బాదుకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. దీంతో కోపోద్రికులైన తందావాసులు. ఆగ్రహంతో పలుగుతండాలోని బాలాజీ నాయక్ విలాస వంతమైన భవనాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లోని ఫర్నిచర్ సు ఇంటి ముందు వేసి తగలబెట్టారు. ఇంట్లోని విలువైన వస్తువులు టీవీ, కిటికీలు డోర్లు పగలగొట్టారు. ఈ ఘటన తో బాలాజీ నాయక్ చాద్రిశుల్లో కలవరం రేపింది.
అధిక వడ్డీ ఆశతో.. కాగా, నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం పలు గుతండాకు చెందిన రమాపత్ బాలాజీ నాయక్ సూటికి పది రూపాయల నుండి 16 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని చెప్పి ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పేద, మధ్య తరగతి ప్రజల నుండి దాదాపు రూ.1000 కోట్ల వరకు. వసూలు చేశాడు. ఇందులో రమావత్ సరియా నాయక్ అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో తెలిసిన వారి నుండి అప్పు తీసుకునీ. సుమారు 30 లక్షల రూపాయల వరకు బాలాజీ నాయక్ కు ఇచ్చినట్లు తండావాసులు చెబుతున్నారు.
తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, తనకు అప్పులు ఇచ్చినవారు తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందిన సరియానాయక్ సోమవారం మిర్యాలగూడ పట్టణంలో క్రిమిసంహారిక ముందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చికిత్స పొందుతూ మరణించారు.. దీంతో అగ్రహించిన బాధితులు మంగళవారం బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేశారు. దీంతో పోలీసులు రంగంప్రవేశంచేసిబాధితుల తోచర్చలు జరుపుతున్నారు
About The Author
