బొల్లంపల్లి రేసులో బూర్గు లింగం యాదవ్ హాట్ టాపిక్..!

బొల్లంపల్లి రేసులో బూర్గు లింగం యాదవ్ హాట్ టాపిక్..!

ప్రభాత సూర్య, కల్వకుర్తి : నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో రాబోయే సర్పంచి ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. లింగాన్ని బలపరిచే జయప్రకాశ్ వంటి కీలక వ్యక్తుల మద్దతు లభించడంతో ఆయన గెలుపు సునాయాసమని గ్రామస్తుల మధ్య చర్చ నడుస్తోంది. ప్రతి పందిరి కింద, ప్రతి ఇంటి ముంగిట వినిపిస్తున్న పేరు ఇప్పుడు ఒక్కటే బూరుగు లింగం యాదవ్.

సోషల్ మీడియా వేదికగా కూడా గ్రామ ప్రజల అభిప్రాయాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. “లింగం యాదవ్ అభ్యర్థిత్వమే అభివృద్ధికి మార్గం” అని గ్రామ యువత నుండి పెద్దలు వరకూ పోస్టులు పెడుతున్నారు. ప్రజలతో మమేకమై సమస్యలను దగ్గరగా తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తూ, గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపే నాయకుడిగా ఆయన పేరు గట్టిగా వినిపిస్తోంది. “సేవ చేసే అవకాశం ఇస్తే, గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాను” అని లింగం యాదవ్ ధృఢ సంకల్పం వ్యక్తం చేస్తున్నారు.

మహాత్మ గాంధీ చెప్పిన “పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు” అన్న సూక్తిని నిజం చేస్తానని ఆయన చెబుతుండగా, గ్రామ ప్రజల్లో విశ్వాసం మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా శుభ్రత, రహదారులు, తాగునీరు సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఇప్పటిదాకా చూపిన కృషి ఆయనకు మద్దతును గణనీయంగా పెంచింది. సహృదయంతో ప్రతి ఒక్కరికి అండగా నిలిచే వ్యక్తిగా, అందరితో సమానమైన అనుభూతిని కలిగించే నాయకుడిగా లింగం యాదవ్ పేరు నిలుస్తోంది.

మాట తప్పేది లేదు… మడమ తిప్పేది లేదు అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన లింగం యాదవ్, ప్రజలే నా బలం,  సేవే నా మతం, గ్రామాభివృద్ధే నా కర్తవ్యము అని గట్టిగా చెబుతున్నారు. ఈ నినాదం గ్రామంలో యువత నుంచి పెద్దల వరకూ ప్రభావం చూపుతోంది. ప్రజల మద్దతు వేగంగా లింగం వైపు చేరుతుండటంతో, బొల్లంపల్లి సర్పంచి రేసు మరింత హోరాహోరీగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో లింగం యాదవ్ అభ్యర్థిత్వం ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా జయప్రకాష్ బలపరిచిన వ్యక్తులకే అవకాశం గా మారనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

About The Author

Related Posts

Advertisement

Latest News

సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..! సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవలి కాలంలో ఒక పేరు చర్చనీయాంశమైంది. ఈఎల్వీ ఫౌండేషన్ భాస్కర్. సేవా కార్యక్రమాల పేరిట గ్రామాల్లో చురుకుగా తిరుగుతున్న ఆయన చుట్టూ ఇప్పుడు...
బొల్లంపల్లి రేసులో బూర్గు లింగం యాదవ్ హాట్ టాపిక్..!
అందరికి తెలిసాక ఆకస్మికం ఎలా అవుతుంది..!?
ఏడీపీ ఇండియా 26వ వార్షికోత్సవం
టీచర్ యాదయ్య సహకారంతో విద్యార్థులకు మెరుగైన విద్య
వివాదాస్పదంగా మునుగోడు కాంగ్రెస్‌ నేతల వ్యవహారం
మట్టిలో తెలుగు మాణిక్యం