అందరికి తెలిసాక ఆకస్మికం ఎలా అవుతుంది..!?
ఇదేమి చిత్రం..ముందే సమాచారం ఇచ్చి.. అలెర్ట్ చేసి తరువాత పరిశోదనా..!?
ఆసుపత్రి చుట్టూ పిచ్చి మొక్కలు.. వృధాగా వెళ్తున్న నీరు..!? పత్తా లేని సూపరిండెంట్..
మర్రిగూడ, ప్రభాత సూర్య :- నేనుగిచ్చినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యనే సామెతకు, ఏమాత్రం తేడా లేదు డిఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ..!? మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కంటి పరీక్ష క్యాంప్ పరిశీలనకు, నల్లగొండ డిఎంహెచ్వో వచ్చారు.!? పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు, ఎన్నడూ కనపడని సిబ్బంది సైతం, ఆసుపత్రిలో కళకళలాడుతున్నారు..!?
ఆసుపత్రి నిండా రోగులే కాకుండా, సిబ్బందితో దసరా పండుగను తలపిస్తుంది..!? ఆసుపత్రి చుట్టుపక్కల వాతావరణం మొత్తం, చెత్తాచెదారం మురికి నీటితో దోమలు, ఈగల బెడధతో కంపు కొడుతుంది..!? ప్రజలకు ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో చెప్పే డాక్టర్లు, పరిసరాల పరిశుభ్రతతపై చిన్న చూపు చూస్తున్నారు..!? ఆసుపత్రి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు, చెత్తా చెదారంతో ముక్కులు పగిలిపోతున్నాయి..!? ఆసుపత్రి మాత్రమే కాకుండా పరిసరాలు శుభ్రంగా ఉండాలని, అధికారులు ఎందుకు ఆలోచన చెయ్యడం లేదని ప్రశ్నిస్తున్నారు స్థానికులు..!? ఉన్నత అధికారులు వచ్చినప్పుడు పరుగులు తీసే, వైద్యులు సాదారణ సమయంలో కూడా రోగులను పట్టించుకుంటే బాగుండని అనుకుంటున్నారు మండల ప్రజలు..
మేడారం సమ్మక్క,సారలమ్మ గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ విడుదల
About The Author
