సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు: మంత్రికి చాకిరేవుపెట్టి ఉతికారేసిన తీర్పు
“మీరు చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి, ఆలోచన లేకుండా మాట్లాడినట్టు అనిపిస్తోంది. మాకు మీ క్షమాపణ అవసరం లేదు,” అని ధర్మాసనం మండిపడింది.
న్యూఢిల్లీ, సూర్య ప్రతినిధి : మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి తెలిపిన క్షమాపణను తిరస్కరిస్తూ, ‘‘ఇది చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకునే మొసలి కన్నీళ్లు’’ అంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. విచారణ సందర్భంగా, జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం, మంత్రికి చట్టబద్ధంగా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
మూడు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటుకు ఆదేశం సోమవారం నాటి విచారణలో, సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ పోలీసులకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) మే 20 లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ టీంలో ఒక మహిళా అధికారి తప్పనిసరిగా ఉండాలనీ, ముగ్గురు సభ్యులూ IG లేదా SP హోదా కన్నా తక్కువ ర్యాంక్‌లో ఉండకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ ముగ్గురూ రాష్ట్రం వెలుపల నుండి ఉండాలని కూడా ఆదేశించింది.
వైరల్ వీడియో నేపథ్యం: ఒక మీడియా సమావేశంలో, ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలు వెల్లడించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరియు కల్నల్ ఖురేషిలపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచురం కావడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
About The Author

Surya Telugu news, crime investigations, Telugu World news, political analysis, Telugu big stories, Telugu news daily,