విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరుతో వందల కోట్ల కుంభకోణం
On
10 మంది ఏజెంట్లను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీసులు.
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):

అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి, వందల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సేకరించి, మోసం చేసిన విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గుట్టును, నల్గొండ రూరల్ పోలీసులు రట్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన వినోద్ తుకారాం ఖుటే 2016లో ప్రారంభించిన ఈ సంస్థ, మల్టీ లెవల్ మార్కెటింగ్, ప్రైమ్ మెంబర్‌షిప్, ట్రేడింగ్, ప్రాపర్టీస్ పేరుతో ఐదు స్థాయిల్లో కమిషన్లు ఇస్తామని, ఆశచూపి బాధితుల నుండి భారీగా వసూళ్లకు పాల్పడింది. పెట్టిన పెట్టుబడికి రోజువారీ రాబడి, వంద నెలల్లో వంద శాతం క్యాష్ బ్యాక్ వంటి, అసాధ్యమైన హామీలతో ప్రజలను వంచించిన ఈ ముఠా, తాజాగా వేవ్ అనే, కొత్త పేరుతో రంగంలోకి దిగి పాత కస్టమర్ల నుండి మరో లక్ష రూపాయలు వసూలు చేసేందుకు కుట్ర పన్నింది.
నల్గొండ పట్టణంలోని లక్ష్మి గార్డెన్స్ సమీపంలో, బాధితులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తుండగా, పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు, కానాల లక్ష్మినారాయణ రావుతో సహా పదిమంది ఏజెంట్లను, అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వినోద్ తుకారాం ఖుటేతో పాటు, మరో నలుగురు కీలక సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిపై ఐపీసీ సెక్షన్ 420, 120(బి)తో పాటు, డిపాజిటర్ల రక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలంటూ, వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని, ఆన్‌లైన్ పెట్టుబడుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
కేసు ఛేదనలో ప్రతిభ చూపిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ రాఘవ రావు, ఎస్ఐ సైదా బాబు బృందాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.
Tags: క్రైమ్ మిర్రర్
About The Author
Related Posts
Latest News
12 Apr 2026 10:38:48
10 మంది ఏజెంట్లను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీసులు.
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):
అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి,...
