మట్టిలో తెలుగు మాణిక్యం
రైతుబిడ్డ పోలె అశ్వినికి దక్కిన గౌరవం
ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎ తెలుగు గోల్డ్ మెడల్ కు ఎంపిక
తెలంగాణ గవర్నర్, ఇస్రో ఛైర్మెన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరణ.
హైదరాబాద్(ప్రభాత సూర్య):-
చదువుకు పేదరికానికి సంబంధం లేదని, కొన్ని విషయాలు చూస్తే తెలుస్తుంది. పేదరికాన్ని ఎదురుకొని బంగారు పతకానికి ఎంపికైంది తెలుగు బిడ్డ. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నందు, యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ, ఇస్రో చైర్మన్ నారాయణ్, యూనివర్శిటీ అధ్యాపక బృందం పాల్గొన్నారు. 2023-24 సంవత్సరానికి ఎంఎ తెలుగు డిపార్ట్మెంట్ లో, అత్యధిక మార్కులతో ప్రతిభను చాటిన మారుమూల గ్రామీణ ప్రాంతంలో విద్యను అభ్యసించి, ప్రభుత్వ టీచర్ గా వెలిగిన పోలె అశ్వినికి, ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎ తెలుగులో గోల్డ్ మెడల్ ను బహుకరించిది. తెలంగాణ గవర్నర్, ఇస్రో చైర్మన్ చేతుల మీదుగా పోలె అశ్వినికి గోల్డ్ మెడల్ ను అందించారు. పోలె అశ్విని చదువులలోనే కాదు మంచి రచయిత, తన రచనలతో సామాజిక చైతన్యాన్ని మేలుకొలుపుతూ, తన కళం సహాని ద్వారా అక్షర వెలుగులను అందిస్తుంది. ఆమె గోల్డ్ మెడల్ సాధించడం పట్ల, తనకు విద్యను అందించిన గురువులను ఆమె కొనయాడింది. మారుమూల గ్రామంలో అత్యంత పేదరిక కుటుంబం నుండి, ఎన్నో అవవరోదాలను, అవమానల్ని ఎదురుకొని, తన తల్లితండ్రుల సహకారంతో ఉన్నత విద్యను అభ్యశించానని ఆమె అన్నారు. ఆడపిల్లకు చదువు వద్దని చెప్పే ఈ కాలంలో, తనకు అవకాశం కల్పించిన తల్లితండ్రులకు, చదువుకునే హక్కును కలిపించిన రాజ్యాంగ పితమహుడు అంబెడ్కర్ కు, తన గోల్డ్ మెడల్ అకింతమిస్తున్నాని ఆనందాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే తను రచించిన సిరార్చి పుస్తకాన్ని ఆవిష్కరిస్తానని ఈ సందర్బంగా తెలియజేశారు. మట్టిలోని తెలుగు మాణిక్యం పోలె అశ్విని, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని తన కుంటుంబ సభ్యులు, గురువులు అభినందించారు.