ఘనంగా మూడవ బెటాలియన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ఇబ్రహీంపట్నం(క్రైమ్ మిర్రర్):-
ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్ ఆధ్వర్యంలో, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో, 3వ బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జామీల బాష, జాతీయ పతాకాన్ని ఎగురవేసి, హంగు ఆర్భాటాలతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాలను మనం ఎప్పటికీ మరవలేమన్నారు. నేటి సమాజంలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పోలీసులదేనని, ప్రజలందరూ స్వేచ్ఛగా, భయభ్రాంతులు లేకుండా జీవించేందుకు పోలీసు వ్యవస్థ నిరంతరం కృషి చేయాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు. అనంతరం సేవా పథకాలు పొందిన ఆర్.బాలు, ఆర్ఎస్ఐ జె. జానకీరాములు, ఏఆర్ఎస్ఐ లను ఆయన అభినందించారు. ఈ వేడుకల్లో 3వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ శ్రీనివాస రావు, అసిస్టెంట్ కమాండెంట్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు.