ఘనంగా తమ్మడపల్లి బోనాల పండగ
హాజరైన పిఆర్టియూ తెలంగాణ రాష్ట్ర నాయకులు
గాదె వెంకట్ రెడ్డికి శాలువాతో సన్మానం
నల్లగొండ (సూర్య):-
జిల్లాలోని మర్రిగూడ మండలం, తమ్మడపల్లి గ్రామంలో జరిగిన బోనాల పండుగ సందర్బంగా, పిఆర్టియూ తెలంగాణ రాష్ట్ర నాయకులు చల్లం బాలకృష్ణ ఆహ్వానం మేరకు, పిఆర్టియూ పత్రిక సబ్ ఎడిటర్ గాదె వెంకట్ తో పాటు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ రెడ్డి, నామిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సుంకిరెడ్డి జాన్ రెడ్డిలు బోనాల పండుగకు హాజరయ్యారు. బాలకృష్ణ ఆహ్వానాన్ని మన్నించి హాజరైన, గాదె వెంకట్ రెడ్డిని శాలువాతో సన్మానించి ఆహ్వానించారు. అనంతరం మహిమ గల ముత్యాలమ్మ దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు చేసి, ప్రజలు బాగుండాలని కోరుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో, పిఆర్టియూ యూనియన్ సమన్వయంతో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలని అమ్మవారిని కోరుకున్నారు. సాంప్రదాయాలు, భక్తి భావాలను ప్రజల్లో నాటుకుపోయే పండుగ బోనాల పండుగని, కుటుంబ సభ్యులు, దూరపు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఒక్క చోట కలిసి జరుపుకునే, విశేషమైన పండుగ బోనాల పండుగని అన్నారు. ఊరిని ఒక్కటి చేసే ఈ బోనాల పండుగ, తెలంగాణలో జోరుగా సాగుతాయని, ఆ అమ్మవారి దయవల్లే ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలుపడి, అన్నదాతకు అమ్మవారే అండగా ఉండాలని, కొత్త రోగాలు, అనారోగ్యాల భారీ నుండి ప్రజలను అమ్మ కాపాడాలని ఈ సందర్బంగా హాజరైన నాయకులు అమ్మవారి ముందు, ప్రజల బాగుకోసం వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మహ్మద్ రాజాక్, శ్రీశైలం, బొట్టు తదితరులు ఉన్నారు.