మేకల మారమ్మ మరణం పార్టీకి తీరనిలోటు
మారమ్మ పార్దివ దేహానికి పల్లా, నెల్లికంటి, ఉజ్జిని నివాళులు..
మర్రిగూడ(ప్రభాత సూర్య):-
మేకల మారమ్మ మరణం పార్టీకి తీరని లోటని, సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీలో వారి సేవలు మరువలేనివని, మండలంలోని శివన్నగూడెం గ్రామానికి మాజీ సర్పంచ్ గా సేవలు అందించిన మేకల మారమ్మ, మరణం అందరిని కలచి వేసిందన్నారు. ఆమె అంతిమ యాత్రలో సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకటరెడ్డితో పాటు ఎమ్మెల్సీ, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యాదగిరి రావు మాట్లాడుతూ, మేకల మారమ్మ మరణం సిపిఐకి తీరని లోటని, గ్రామ సర్పంచ్ గా ఉన్న సమయంలో ఆమె గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందన్నారు. ఆమె ఉద్యమ స్ఫూర్తిని యువత నెమరేసుకుంటూ, ఆమె బాటలో నడవాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్య చారి, బొలుగురి నరసింహ, నల్లపురాజురామ లింగయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు బిక్షం, అఖిలభారత యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు, బూడిద సురేష్, మండల పార్టీ కార్యవర్గ సభ్యులు కొమురయ్య, జక్కలి అంజయ్య, ఎరుకలి నిరంజన్, బొల్లం యాదయ్య, ఐతగొని యాదయ్య, కొట్టం యాదయ్య, అయితగోని వెంకటయ్య, గుండెబోయిన శ్రీను, మేతరి యాదయ్య, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.