నవరాత్రులకు పోలీసుల అనుమతి కావలసిందే
మర్రిగూడ ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి
మర్రిగూడ(ప్రభాత సూర్య):-
మండల పరిధిలోని ఆయా గ్రామాలలో, వినాయక ఉత్సవాలు నిర్వహించనున్న యువత, గ్రామస్థులు పోలీస్ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, మర్రిగూడ ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ నందు అనుమతి కోసం https://policeportal.tspolice.gov.in/index.htm లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. నవరాత్రులు పండుగ చెయ్యాలని అనుకుంటున్న యువత, అల్లర్లు కాకుండా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు రాత్రి సమయాలలో ఆలయ ప్రాంగణం వద్ద, నిఘా పెట్టుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులకు ఉండాలన్నారు. డిజేలు పెట్టడానికి అనుమతులు లేవని ఈ సందర్బంగా తెలిపారు. ఘర్షణ వాతావరణాన్ని ప్రేరేపించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తిశ్రద్దలతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, నవరాత్రులు జరుపుకోవాలని కోరారు. కరెంట్ కనెక్షన్ లోపాలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అర్ధరాత్రుల్లు సైతం హంగామా చేస్తూ, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని తెలిపారు. నిమర్జనం చేసే ప్రాంతాలు, తరలించే వాహనాల వివరాలను ముందుగానే పొందుపరచాలని అన్నారు. నిబంధనలు పాటించని ఆర్గనైజేషన్ మెంబర్ లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాఅండ్ఆర్డర్ కు సహకరించి పోలీసులకు సపోర్ట్ గా ఉండాలన్నారు.