అమరావతిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ - ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక అంశం.

అమరావతిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ - ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక అంశం.

కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేస్తున్నారా...! లేదే.. అప్పులు మాత్రం ఇప్పిస్తున్నారు. అది రాష్ట్రంపై పెను భారంగా అన్నది.. వైసీపీ లేవనెత్తుతున్న ప్రశ్న. పాలనా వికేంద్రీకరణ లేకపోతే... ఇబ్బందులు

అమరావతి, సూర్య : అమరావతి ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక అంశం. అమరావతిని మూడేళ్లలో కట్టి చూపిస్తామని చంద్రబాబు పట్టుబట్టి కూర్చున్నారు. ఏపీకి ఒక గొప్ప రాజధానిని నిర్మించి చూపిస్తామంటున్నారు. దీన్ని... వైసీపీ తన అస్త్రంగా మలుచుకుంటోంది. ఏపీ అంటే అమరావతి మాత్రమే కాదని.... రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల పరిస్థితి ఏంటని.. ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత క్యాపిటల్‌ సిటీ హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లిపోయింది. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా... ఇప్పటివరకు ఏపీకి రాజధాని అంటూ లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. మూడు రాజధానుల అంశం ఎత్తుకుంది. అమరావతిని పక్కకు నెట్టింది. 2024 ఎన్నికల్లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే... ఇక్కడ ఒక పాయింట్‌ను ఎత్తిచూపుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. రాష్ట్రానికి రాజధాని అవసరమే. అయితే... ఆదిలోనే అత్యంత ఖరీదైనదా...? రాజధాని కోసం ఇప్పటికే వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యే నాటికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో... అవన్నీ అప్పులు కావా... రాష్ట్రంపై భారం కావా..? అన్నది వైసీపీ ప్రశ్న. అంతేకాదు... భారీగా అప్పులు తెచ్చి.. అమరావతి నిర్మాణానికే ఖర్చు పెడితే... రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి మాటేంటని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. దీన్నే తమ ప్రచార అస్త్రంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.

అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని ప్రధాని మోడీ కూడా చెప్పారు. అయితే... కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేస్తున్నారా...! లేదే.. అప్పులు మాత్రం ఇప్పిస్తున్నారు. అది రాష్ట్రంపై పెను భారంగా అన్నది.. వైసీపీ లేవనెత్తుతున్న ప్రశ్న. పాలనా వికేంద్రీకరణ లేకపోతే... ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ సోషల్‌ మీడియాల్లో ఈ విషయాన్నే ఊదరగొడుతున్నారు. 

అప్పులు చేసి అమరావతి కట్టడం... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఫణంగా పెట్టడమే అని వైసీపీ నేతలు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పైగా అమరావతికి కృష్ణా నది నుంచి ముంపు ముప్పు కూడా ఉంది. ఇవన్నీ ఆలోచించకుండా వేల కోట్ల రూపాయలు అమరావతిపై పెడుతున్నారని.. ఇప్పుడు వేల కోట్లు.. అమరావతి పూర్తయ్యే నాటికి లక్షల కోట్లు అవుతాయని అంటున్నారు. దీనిపై ప్రజలు ఆలోచించాలని కోరుతున్నారు వైసీపీ నేతలు. దీన్ని ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు... అమరావతికే జై కొడతారా...? వైసీపీ వర్షన్‌పై ఆలోచిస్తారా..? ఏది ఏమైనా... అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం మాత్రం పట్టుదలతో ముందుకు వెళ్తోంది.

Tags: Ysrcp

About The Author

Advertisement

Latest News

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...
#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌