CITU : దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

CITU : దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

అఖిల పక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఈనెల 20వ తెదీ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

తుర్కయంజాల్‌, సూర్య : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లను దేశమంతా వ్యతిరేకిస్తోందని, కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్‌ కోడ్‌లను తీసుకురావడం దారుణమని సీఐటీయూ నేతలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, అసోసియేషన్ల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు 2025 మే 20న జరిగే సమ్మెలో పాల్గొనాలని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని వివిధ కంపెనీల యజమానులకు సమ్మె నోటీసు ఇచ్చారు.CPIM 

ఈ సందర్భంగా ఈ సందర్భంగా సీఐటీయూ మున్సిపల్ నాయకులు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. కోడ్స్ గనుక అమలు జరిగితే కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోని కార్మికుల స్థితిగతులు అన్నింటిని సమీక్ష చేసిన కేంద్ర కార్మిక సంఘాలు స్వాతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు మే 20వ తేదీన దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామని ఆ సమ్మెలో వివిధ పరిశ్రమంలో పనిచేస్తున్న కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ తుర్కయంజాల్ మున్సిపల్ నాయకులు మండల సత్యనారాయణ, ఇల్లూరు భాస్కర్, జే ఆశీర్వాదం, ఏ మాధవరెడ్డి, ఎన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Latest News

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...
#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌