బైక్‌ను దగ్ధం చేసిన గుర్తుతెలియని దుండగులు
చింతపల్లి- ప్రభాత సూర్య : ఇంటి ఎదుట గ్రామ పంచాయతీ వద్ద పార్క్ చేసిన టీఎస్ O5 ఇఎస్ 6181 నెంబర్ పల్సర్ బైక్ ను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దగ్ధం చే సిన ఘటన శుక్రవారం అర్థరాత్రి సమయంలో చింతపల్లి మండల పరిధిలోని కిష్టరాయిని పల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.
చింతపల్లి ఎస్ఐ బి. యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం కిష్టరాయనిపల్లి గ్రామానికి చెందిన మోర శ్రీరాములు రోజు మాదిరి గానే యధావిధిగా ఇంటి ఇంటి ఎదుట తన బైక్ పార్క్ చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి1.10 నిమిషాలకు అతని తండ్రి మోర రామచంద్రం మూత్ర విసర్జనకు బయటికి వెళ్లగా పల్సర్ బైకు తగలబడుతుండడంతో అది చూసి కుమారుడైన శ్రీరాములుకు చెప్పాడు. వెంటనే వెళ్లి చూడగా పల్సర్ బైక్ మంటల్లోఖాళీ పోతుండడంతో నీటితో మంటలను ఆర్పేశాడు.
అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన బైక్ కు నిప్పు పెట్టి దగ్ధం చేసినట్లు బాధితుడు ఆరోపించారు.శనివారం బాధితుడు శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.