#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్
సూర్య, చండూరు ప్రతినిది : తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధికి నిధులు వచ్చాయని గొప్పలు చెప్పుకునే రాజగోపాల్ రెడ్డి ఈ ప్రభుత్వ పాలనలో నిధులు రావడం లేదు కాబట్టి వెంటనే తన పదవికి రాజీనామా చేసి నిధులు తెప్పించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సవాలు విసిరారు. ఆయన శనివారం బిఆర్ఎస్ నాయకులతో కలిసి చండూరు మార్కెట్ యార్డ్ నుంచి చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులను పరిశీలిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. రాజగోపాల్ పాలన గోల్మాల్ గా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఏరుకోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టు ఉందని ఎద్దేవా చేశారు. చండూరు అభివృద్ధి పట్టలేదు గాని పదవుల కోసం రాజగోపాల్ రెడ్డి పాకులాడుతున్నారంటూ విమర్శించారు.
ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు ప్రాజెక్టుల గురించి ఏ ఒక్క రోజు కూడా ఆయనకు పట్టలేదు అన్నారు. తాను చేసిన అభివృద్ధి తప్ప ఆయన కొత్తగా త్వరగా పెట్టింది ఏమీ లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన 30 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉండగా తను ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని కొందరు పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ రోడ్డు వెడల్పును చేపట్టారని ఆరోపించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ప్రశ్నిస్తున్న కార్యకర్తల పైన అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చారన్నారు. ప్రజలు గమనిస్తున్నారని స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.
అంతకు ముందు ర్యాలీలో డ్రైనేజీ పనులు పరిశీలిస్తూ స్థానికులతో మాట్లాడారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎత్తపు మధుసూదన్ రావు, మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు బొమ్మరిబోయిన వెంకన్న, కొత్తపాటి సతీష్, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న,మాజీ కౌన్సిలర్లు అన్నపర్తి శేఖర్,కోడి వెంకన్న, గుంటి వెంకటేశం, ఉజ్జిని అనిల్ రావు, బొడ్డు సతీష్, డిసిసిబి డైరెక్టర్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జూలూరు శ్రీనివాసులు, జూలూరు ఆంజనేయులు, తేలు కుంట్ల జానయ్య, తేలుకుంట్ల శేఖర్, నకిరేకంటి రామలింగం, సంగెపు సువర్ణ, ఇరిగి రామన్న, రాపోలు వెంకన్న, చొప్పరి దశరథ, లోకేష్ బిఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.