#CITU : ఆదర్శ నేత,అవిశ్రాంత పోరాట యోధులు సుందరయ్యకు ఘన నివాళులు
తుర్కయంజాల్, సూర్య: దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత, సిపిఐఎం వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమరయోధులు పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని తుర్కయంజాల్ సిపిఎం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు, తుర్కయంజాల్ మున్సిపల్ కార్యదర్శి డి కిషన్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ తన చిన్నతనంలోనే అంటరానితనం, కుల వివక్షత పైన పోరాటం చేసిన మానవతావాది అని అన్నారు. చదువుకునే రోజుల్లోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపిన గొప్ప త్యాగశీలి అని అన్నారు.

దోపిడీకి వ్యతిరేకంగా మనిషివేతులకు వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించారని అన్నారు. తాను ప్రజాప్రతినిధిగా కొనసాగినంత కాలం అటు చట్టసభల్లో ఇటు బయట ప్రజల పక్షాన పోరాడిన నికార్సైన కమ్యూనిస్టు అని కొనియాడారు. అణువణువునా జాతీయభావాల నింపుకొన్న నిజమైన దేశభక్తి గల వ్యక్తని అన్నారు.నేడు ప్రపంచీకరణ పేరుతో జరిగే ఆర్థిక వలసవాదం దేశాన్ని కబళిస్తున్న ఈ సందర్భంలో సుందరయ్య లాంటి నేతల అవసరం మరింత అవసరమని అన్నారు బహుళ జాతి కంపెనీలు రైతుల భూములను ఆక్రమిస్తున్నప్పుడు విదేశీ పెట్టుబడులు కార్మికుల శ్రమను దోచుకుంటున్నప్పుడు ఆర్థిక శాసనాల పేరిట మానవ హక్కులు విడిచిపెడుతున్నప్పుడు సుందరయ్య జీవితం నేటి సమాజానికి ఎంతో బలం ఇస్తుందని ఎదురు తిరిగే తెగవనిస్తుందని అన్నారు.
ఈరోజు ప్రపంచీకరణలో నలిగిపోతున్న స్థానిక జీవన విధానాలకు మతోన్మాదంలో మగ్గుతున్న సామాజిక చైతన్యానికి సుందరయ్య ఆశయాలు లక్ష్యాలు స్ఫూర్తి దాయకమని అన్నారు. సుందరయ్య ఆశయ సాధన కోసం కమ్యూనిస్టులంతా కృషి చేయాలని, అప్పుడే సుందరయ్య కి నిజమైన నివాళులర్పించిన వారమవుతమని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ సభ్యులు కే అరుణ్ కుమార్, నాయకులు బి శంకరయ్య, ఏ మాధవరెడ్డి,ఆశీర్వాదం, అంజయ్య,కుమార్ యాకయ్య,నాంపల్లి శంకర్, పరమేష్, శేఖర్ రెడ్డి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.