శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవం..

కొత్తకుర్మ సత్తయ్యకు ఆహ్వానం...

శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవం..

బాలాపూర్ కురుమ సంఘం ప్రతినిధులతో, సంప్రదాయాల పరిరక్షణపై చర్చ

తుర్కయంజాల్, మే 22 (సూర్య ప్రతినిధి): తుర్కయంజాల్‌ టీజీకాబ్ వైస్ చైర్మన్ మరియు డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య గారి నివాసంలో బుధవారం బాలాపూర్ కురుమ సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. జూన్ 2న జరగనున్న శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవంకి ఆయనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ, ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మహోత్సవ విశిష్టతను వివరించారు. ప్రతి సంవత్సరం శ్రీ బీరప్ప దేవి మరియు కామరాతి అమ్మవారి కల్యాణం శ్రద్ధా భక్తులతో నిర్వహించబడుతుందని, ఈ పండుగ కురుమ తల్లి సంఘానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నదని వారు తెలిపారు.

కల్యాణ మహోత్సవాన్ని లక్షలాది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్సవ సందర్భంలో పల్లకీ సేవ, కళాశాల రథోత్సవం, అన్నదానం, సంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కురుమ సామాజిక భద్రతపై చర్చ సందర్బంగా కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ, కురుమ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన ప్రతి విషయంలో తనపరంగా చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. మన సంప్రదాయాలు, దేవతల ఉత్సవాలు భవిష్యత తరాలకు మన సంస్కృతిని అందించే వేదికలు. ఈ తరహా కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు, విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు మల్లేష్, గుండ్ల రమేష్, మేకల మల్లేష్, ధనాజ్, బండారి మనోహర్, మేకం సంజీవ, సత్యనారాయణ, రావుల మల్లేష్, జేత్త శ్రీకాంత్, కొండలు రావుల మహేందర్, రావుల లింగం, కిష్టపురం సత్తయ్య, జేత్త రవి, తుర్కయంజాల్ కురుమ సంఘం అధ్యక్షుడు వసపరి బాబాయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Latest News

Malreddy RangaReddy : పేదింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. Malreddy RangaReddy : పేదింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.
804 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ తుర్కయంజాల్, సూర్య ప్రతినిధి : పేదలకు ఆవాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల...
రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం - హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..!
MLA RangaReddy : కుంట్లూరు రోడ్డుప్రమాదం దురదృష్టకరం
శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవం..
ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సిఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ – కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన
జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ హోమియోపతి మందుల పంపిణీ