రైతులకు అవగాహన సదస్సులతో ఎంతో మేలు జరుగుతుంది.
రైతుల అవగాహనా సదస్సులో పాల్గొన్న TGCAB వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య
తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య యూనివర్సిటీ అనుబంధ సంస్థ వారి AINP ప్రోగ్రాం ద్వారా ప్రిన్సిపాల్ రజినీకాంత్ రైతులకు ఇచ్చిన సలహాలు
సూర్య, తుర్కయంజాల్ : అవగాహన సదస్సులు రైతులకు ఎంతో మేలు చేస్తాయని, రైతులు సహజ విధానాలతో వ్యవసాయం చేసేలా అవగాహన పెంచుకోవాలని TGCAB వైస్ చైర్మన్,డీసీసీబీ చైర్మన్, తుర్కయంజాల్ సహకార సంఘం చైర్మన్ కొత్తకూర్మ సత్తయ్య అన్నారు. సోమవారం తుర్కయంజాల్ రైతు సేవ సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హైదరాబాద్ వారు రైతుల కోసం వ్యవసాయం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య యూనివర్సిటీ అనుబంధ సంస్థ వారి AINP ప్రోగ్రాం ద్వారా ప్రిన్సిపాల్ రజినీకాంత్ రైతులకు ఇచ్చిన సలహాలకు స్పందిస్తూ కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ ఇలాంటి అవగాహన సదస్సులు రైతులకు ఎంతో మేలు చేస్తాయని, రైతులు సహజ విధానాలతో వ్యవసాయం చేసేలా అవగాహన పెంచుకోవాలని, రైతులు ఇలాంటి సదస్సులకు హాజరై సందేహాలు అడిగి, వాటి నుంచి పూర్తిగా ఉపయోగం పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ రైతు సేవ సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి, సంఘం సీఈఓ వై. రాందాస్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పల్లవి, AEO రఘుపతి, వ్యవసాయ శాస్త్రవేత్త అరుణ, స్థానిక రైతులు లక్ష్మా రెడ్డి, బల దేవ్ రెడ్డి, కృష్ణ రెడ్డి, శేఖర్ రెడ్డి, కోషిక ఐలయ్య, కుంట గోపాల్ రెడ్డి, ప్రజలు, యూనివర్సిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.