తెలంగాణ -చత్తీస్ ఘడ్ సరిహద్దులో మరో భారీ ఎన్ కౌంటర్?

సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీ ఎన్కౌంట ర్‌ను అధికారికంగా ధృవీకరించారు.

తెలంగాణ -చత్తీస్ ఘడ్ సరిహద్దులో మరో భారీ ఎన్ కౌంటర్?

ఆప రేషన్ కగార్’గా కొనసాగు తున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా CRPF యూనిట్లు, ఛత్తీస్‌ గఢ్-తెలంగాణ సరిహద్దు లోని గుట్టల మధ్యలోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్

హైదరాబాద్: మే 07 సూర్య : బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండలలో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆప రేషన్ కగార్’గా కొనసాగు తున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా CRPF యూనిట్లు, ఛత్తీస్‌ గఢ్-తెలంగాణ సరిహద్దు లోని గుట్టల మధ్యలోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. 

ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు, ముఖ్యంగా హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయి స్టులను పట్టుకోవడం. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టుల ఉనికి ఉందన్న బలమైన సమాచారం మేరకు ముందుచూపుతో ఆపరేషన్ సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. 

సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీ ఎన్కౌంట ర్‌ను అధికారికంగా ధృవీకరించారు. ఇక ఓ మహిళా మావోయిస్టు మృతి చెందిన ఘటనలో అధికారులు 303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు కర్రెగుట్టల గుట్టలపై ఆధిపత్యాన్ని సాధించాయి. ధోబే కొండలు, నీలం సరాయి ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేయ గా, అలుబాక శివారులో మరో క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. 

ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు, సిగ్నలింగ్ టవర్లు ద్వారా మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలు భూగర్భ బంకర్ల వేట కొనసాగిస్తున్నాయి. వందల సంఖ్యలో మావో యిస్టులు ఈ ప్రాంతాల్లో బంకర్లు నిర్మించినట్లుగా సమాచారం అందడంతో, భద్రతా బలగాలు ప్రతి ఇంచు ఇంచుగా గాలిస్తు న్నారు. మందుపాతరలు, IED బాంబులపై ప్రత్యేక నిఘా పెట్టి, ముందస్తు అపాయాన్ని నివారించేం దుకు జాగ్రత్తలు తీసుకుం టున్నారు.

About The Author

Advertisement

Latest News

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...
#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌