జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
టీయూడబ్ల్యూజే (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్) ఐజేయు కొత్తగూడ మండల అధ్యక్షుడు షేక్ సల్మాన్ పాషా...
సూర్య, కొత్తగూడ : భారత రాజ్యాంగం కల్పించిన 19 (1) భావ స్వేచ్ఛ ప్రకటన పై పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, జర్నలిస్టులపై పెడుతున్న అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల శాఖ అధ్యక్షులు ఎస్కే సల్మాన్ పాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మాచర్లలో జరిగిన హత్య కేసు కు సంబంధించిన విషయంలో సాక్షి పత్రిక నిజ నిజాలను ప్రచురిస్తే, సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై మరియు మరో ఆరుగురు జర్నలిస్టుల మీద అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మీడియా రక్షణ చట్టాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే, రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన హక్కును కాలరాసినట్లే అని అ ప్రకటనలో పేర్కొన్నారు.