ఆపరేషన్ సిందూర్.. వైరల్ గా మాజీ ఆర్మీ ఛీప్ పోస్ట్

తక్కువ టైంలో.. ఇంత పెద్ద స్థాయిలో రిటర్న్ గిఫ్ట్ వస్తుందని పాక్ అస్సలు ఊహించలేదు.

సూర్య, న్యూస్ డెస్క్ : ‘నా భర్తను చంపేశారు. నేను బతికి లాభం లేదు. నన్ను కూడా చంపేయండి’.. తన భర్తను చంపిన ఉగ్రవాదులను ఓ భార్య వేడుకుంది. ఆ ఉగ్రమూకలు గట్టిగా నవ్వుతూ ‘ మేము మిమ్మల్ని చంపం.. పోయి మీ మోదీకి ఈ విషయం చెప్పండి’ అని అన్నారు. సరిగ్గా 13 రోజుల తర్వాత ఉగ్రవాదులకు, వారికి సపోర్టు చేస్తున్న వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఊహించని సమాధానం చెప్పారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో .. నిన్న 9 ఉగ్రస్థావరాలపై మిస్సైల్ దాడులు జరిగాయి.

తక్కువ టైంలో.. ఇంత పెద్ద స్థాయిలో రిటర్న్ గిఫ్ట్ వస్తుందని పాక్ అస్సలు ఊహించలేదు. పదుల సంఖ్యలో టెర్రరిస్టులు చనిపోయారు. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ చీఫ్ స్వయంగా వెల్లడించాడు. ఆపరేషన్ సిందూర్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ భారత ఆర్మీ చీఫ్ మనోజ్ నవరానే కూడా ‘ ఆపరేషన్ సిందూర్’పై స్పందించారు. బుధవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు.

నిన్న ఉదయం పది గంటల ప్రాంతంలో ‘ సినిమా ఇంకా అయిపోలేదు’ అంటూ క్రిప్టిక్ పోస్టు పెట్టారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కార్టూన్ ‘ ఐ టోల్డ్ మోదీ’ని షేర్ చేశారు. ‘ సూటిగా సుత్తి లేకుండా.. ఐదు పదాల్లో మొత్తం స్టోరీ ఇదే’ అని రాసుకొచ్చారు. ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ ఆర్మీ చీఫ్ పెట్టిన ‘ సినిమా ఇంకా అయిపోలేదు’ అన్న క్రిప్టిక్ పోస్టు చర్చనీయాంశంగా మారింది. తర్వాత ఏం జరగబోతోందా అని అందరూ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు..

About The Author

Advertisement

Latest News

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...
#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌