ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధి హామీ పనులు చేపట్టాలి.!

పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ సృజన

ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధి హామీ పనులు చేపట్టాలి.!

ఉపాధి హామీ కింద పొలాలకు కట్టలు వేసుకోవడమే కాకుండా చెక్ డ్యామ్ ల నిర్మాణాలను పెద్ద మొత్తంలో చేపట్టలని ఆమె అధికారులు సూచించారు.

ప్రభాత సూర్య / వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ సృజన అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం చీమల్ దారి గ్రామంలో,నవాబ్ పెట్ మండలం వట్టిమీనేపల్లి, నవాబ్ పేట్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాలల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో కమీషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖిగా మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకం కింద ఎన్ని రోజులు పని చేస్తున్నారని, రోజుకు 307 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద పొలాలకు కట్టలు వేసుకోవడమే కాకుండా చెక్ డ్యామ్ ల నిర్మాణాలను పెద్ద మొత్తంలో చేపట్టలని ఆమె అధికారులు సూచించారు. ఆదాయ వనరులు కల్పించే పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని ఆమె సూచించారు.

IMG-20250504-WA0011
ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖిగా మాట్లాడుతూ.

ఉద్యానవన పంటలతో పాటు మునగ,జామ , మామిడి, సీతాఫల్ పంటలను సాగు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని ఆమె అధికారులు సూచించారు.పంచాయతి రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ పర్యటన భాగంగా అవెన్యూ ప్లాంటేషన్, కాంపోస్ట్ షెడ్, ఫాం పాండ్ నిర్మాణ పనులు పరిశీలించారు.నవాబ్ పెట్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కింద నిధులతో చేపట్టిన పౌల్ట్రీ ఫాం ను కమిషనర్ ప్రారంభించారు. కమిషనర్ పర్యటనలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్,అదనపు కలెక్టర్ సుధీర్, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, పంచాయత్ రాజ్ ఉమేష్, ఎంపీడీఓలు విజయలక్ష్మి, అనురాధ, ఉపాధి హామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

భాగ్యనగర్ కాలనీలో ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లు – కాలనీ వాసుల ఆందోళన భాగ్యనగర్ కాలనీలో ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లు – కాలనీ వాసుల ఆందోళన
రోడ్లపై తేగిపడ్డ కేబుల్‌లు – బాధ్యత ఎవరిది? అధికారుల దృష్టికి కాలనీవాసుల విజ్ఞప్తి – కేబుల్ సమస్య పరిష్కరించండి రోడ్డుపై పడిన కేబుల్ వైర్లు – ప్రజల...
ప్రజాధనాన్ని దుర్వినియోగ పరచకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సాధించండి
భూపాల్ ఆర్టీఐ క‌మిష‌న‌ర్‌గా నియ‌మితులు కావ‌డం హ‌ర్ష‌ణీయం
ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు అక్ర‌మాల‌ను స‌హించేది లేదు - హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌
మ‌ణికొండ మున్సిపాలిటీలో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు 
వడదెబ్బతో రైతులు అప్రమత్తంగా ఉండాలి- డాక్టర్ చినుకని శివప్రసాద్
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ మహిళలను మోసం చేస్తున్న నిందితులు అరెస్ట్